యంగ్‌ హీరో వర్షాన్ని ఎలా ఆస్వాదిస్తున్నాడో చూశారా..?

ABN , First Publish Date - 2020-10-14T00:40:07+05:30 IST

హైదరాబాద్‌.. వర్షంతో తడిసి ముద్దవుతోంది. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో విపరీతంగా వర్షం పడుతోంది. వాతావరణం కూడా మారిపోయింది. మధ్యాహ్నం

యంగ్‌ హీరో వర్షాన్ని ఎలా ఆస్వాదిస్తున్నాడో చూశారా..?

హైదరాబాద్‌.. వర్షంతో తడిసి ముద్దవుతోంది. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో విపరీతంగా వర్షం పడుతోంది. వాతావరణం కూడా మారిపోయింది. మధ్యాహ్నం కూడా చిమ్మ చీకట్లు కమ్మేయడంతో.. వెలుగు అనేది లేకుండా పోయింది. అయితే హైదరాబాద్‌ వాతావరణాన్ని, వర్షాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా పేర్కొంటూ.. వర్షపు చినుకుల్ని ఆస్వాదిస్తున్న వీడియోని ఓ యంగ్‌ హీరో షేర్‌ చేశారు. ఇంతకీ ఎవరా యంగ్‌ హీరో అనుకుంటున్నారా? ఇంకెవరు.. ఇస్మార్ట్ రామ్‌.
తాజాగా ఆయన వర్షాన్ని ఆస్వాదిస్తున్న వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోలో ఒక్కొక్క చినుకు రామ్‌ ముఖంపై పడుతుంటే.. ఆయన ఎంతో ఆనందంతో..ఆ చినుకుల్ని ఆస్వాదిస్తున్నారు. ''మీరు ఆలోచించిన ప్రతిసారీ.. మీకొక అవగాహన వస్తుంది.. మరియు అది మీ ఆలోచనా విధానాన్ని మారుస్తుంది.." అంటూ హైదరాబాద్‌ను ఇష్టపడుతున్నట్లుగా రామ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-10-14T00:40:07+05:30 IST