పరిశ్రమ పుంజుకోవాలంటే రామ్‌ ‘రెడ్’ ఎనర్జీ కావాలట

ABN , First Publish Date - 2020-12-25T02:06:40+05:30 IST

యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌.. నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోహీరోయిన్లుగా స్రవంతి మూవీస్ పతాకంపై నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన

పరిశ్రమ పుంజుకోవాలంటే రామ్‌ ‘రెడ్’ ఎనర్జీ కావాలట

యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌.. నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోహీరోయిన్లుగా స్రవంతి మూవీస్ పతాకంపై నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన చిత్రం 'రెడ్‌'. దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతిదీ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ప్రమోషన్‌లో భాగంగా గురువారం చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్ ఏఎమ్‌బీ సినిమాస్‌ లో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ మంచి స్పందనను రాబట్టుకుంటూ.. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది.


ఇక ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ''చాక్లెట్‌ బాయ్ ఇమేజ్ నుంచి ఇస్మార్ట్ శంకర్‌లో విశ్వరూపం చూపించి మాస్ ఇమేజ్ కూడా సంపాదించుకున్నాడు రామ్. ఇప్పుడు రెడ్‌తో దాన్ని రెండింతలు చేసుకోనున్నాడు. ఆశ్చర్యమేంటంటే చాలా సున్నితంగా, క్లాస్ గా కనిపించే డైరెక్టర్ కిషోర్ తిరుమల కూడా ఈ చిత్రంతో తాను మాస్ చిత్రాలు రాయగలడని, తీయగలనని నిరూపించుకున్నాడు. ఈ చిత్రంలోని థ్రిల్లింగ్ కథ, సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. అలాగే హీరో రామ్ పోతినేని డబుల్ రోల్ లో చాలా బాగా చేశాడు. ఖచ్చితంగా హిట్టు కొట్టబోతున్న చిత్రం ఇది. నిర్మాత రవికిశోర్ గారి నిర్ణయాలు, డైరెక్టర్ కిషోర్ తిరుమల కథ విషయంలో తీసుకునే జాగ్రత్తలు ఈ చిత్రంలో కూడా కనిపిస్తాయి, మణిశర్మ సంగీతం గట్టి బలమవుతుంది, అలాగే మంచి టీమ్ ఉంది ఈ చిత్రానికి. ఇస్మార్ట్ శంకర్ తరువాత ఈ పండగకి వస్తున్న రెడ్, రామ్ కి దానికంటే పెద్ద హిట్ అవ్వబోతోంది. పరిశ్రమకి పండగకి పెద్ద హిట్ రామ్ ద్వారా రానున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 9  నెలల తరువాత మళ్ళీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా చిత్ర పరిశ్రమ సిద్దమయ్యింది. ఈ నెలలో విడుదలయ్యే చిత్రాలనుండి మొదలుకుని సంక్రాంతికీ, ఆ తరువాత కూడా విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్న చిత్రాలన్నిటికీ మంచి విజయం దక్కాలి అని, థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు అన్ని జాగ్రత్తల మధ్యే  చిత్రాన్ని చూసి ఆనందించాలని కోరుకుంటున్నాం" అని అన్నారు.


మరో నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము) మాట్లాడుతూ.. ''రామ్ పోతినేని మన తెలుగు పరిశ్రమలో ఉన్నవాళ్లందరిలో చాలా ఎనర్జిటిక్ స్టార్ అని నా అభిప్రాయం. ట్రైలర్ చూశాక, పరిశ్రమ మళ్ళీ పుంజుకోవడానికి ఇంత ఎనర్జీ అవసరం అనిపిస్తుంది. ప్రేక్షకులని ఇలాంటి పరిస్థితుల మధ్య థియేటర్లకు వచ్చేలా చేయాలంటే చాలా గట్టి కథ కావాలి, ఇది ఖచ్చితంగా అలాంటి చిత్రమే. మిత్రులు రవికిశోర్ కి, డైరెక్టర్ కిషోర్ తిరుమలకి, రామ్ కి అభినందనలు. రెడ్ చిత్రం సంక్రాంతికి విడుదలై చాలా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను.." అని అన్నారు.


దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ''10 నెలల్లో కోల్పోయిన ఆనందాల్లో థియేటర్లు కూడా ఉంటాయి. ఈ 10 నెలల విరామానికి ఆనందం పదింతలయ్యి మీకు చేరాలని కోరుకుంటున్నాము. ఈ చిత్రానికి అవకాశమిచ్చినందుకు స్రవంతి రవి కిశోర్ గారికి, రామ్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రంలో సహకరించినందుకు మా కెమెరామన్ సమీర్ రెడ్డి గారికి, ఏ.ఎస్. ప్రకాష్ గారికి, మణిశర్మ గారికి, ఎడిటర్ జునైద్ గారికి, హీరోయిన్లు అమృత, మాళవిక, నివేత మరియు ఇతర టీమ్ అందరికి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రం అందరికి మంచి సక్సెస్ ని, గుర్తింపుని ఇవ్వాలని కోరుకుంటున్నాను." అన్నారు.


హీరోయిన్ నివేదా పేతురాజ్ మాట్లాడుతూ.. ''మళ్ళీ థియేటర్లకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా హిట్ కొట్టే చిత్రంతో వస్తున్నాము. ఇస్మార్ట్ శంకర్ చూసిన నాకు రామ్ ఎనర్జీ అర్ధమయిపోయింది, ఈ చిత్రంలో అది ఇంకా డబుల్ అయ్యింది. కిషోర్ తిరుమల గారి నుండి ఇలాంటి మాస్ థ్రిల్లర్ రావడం అందరితో పాటు నాకు ఆశ్చర్యమేసింది, ఆయనలో ఒక ఒక కొత్త రకమైన కోణం ఇది. చిత్ర టీం తో పని చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చి థియేటర్లలో మా చిత్రాన్ని చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను." అన్నారు.


హీరోయిన్ మాళవిక శర్మ మాట్లాడుతూ, "మా రెడ్ చిత్రం సంక్రాంతికి విడుదలవుతుంది. పూర్తి చిత్రం చూసాక మా అందరికి ఇంకా చాలా నచ్చింది, మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాము. అందరూ తప్పకుండా చూడండి." అని అన్నారు.

Updated Date - 2020-12-25T02:06:40+05:30 IST