10వేల అడుగుల ఎత్తులో పాట పాడుకున్న రామ్‌

ABN , First Publish Date - 2020-02-21T21:12:02+05:30 IST

యూరప్‌లో చాలా ఎగ్జయిటింగ్‌ లొకేషన్‌ 'డొలమైట్స్'. ఇటలీకి చెందిన ఈ పర్వత తీరప్రాంతంలో చాలా హాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌లు జరిగాయి. లేటెస్ట్ గా 'రెడ్‌' సినిమా షూటింగ్‌ ఇక్కడ జరిగింది.

10వేల అడుగుల ఎత్తులో పాట పాడుకున్న రామ్‌

యూరప్‌లో చాలా ఎగ్జయిటింగ్‌ లొకేషన్‌ 'డొలమైట్స్'. ఇటలీకి చెందిన ఈ పర్వత తీరప్రాంతంలో చాలా హాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌లు జరిగాయి. లేటెస్ట్ గా 'రెడ్‌' సినిమా షూటింగ్‌ ఇక్కడ జరిగింది. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం 'రెడ్'. కిశోర్‌ తిరుమల  దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్‌ నిర్మి స్తున్న'రెడ్' చిత్రం కోసం రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ఆ రెండు పాటల్లో ఒకదాన్నిడోలమైట్స్ లో షూట్‌ చేయడం విశేషం. ఆ ముచ్చట్లను 'స్రవంతి' రవికిశోర్‌ వివరిస్తూ - ''ఈ నెల 12 నుంచి 18 వరకూ ఇటలీలోని బ్యూటీఫుల్‌ లొకేషన్స్ లో రామ్‌, మాళవికా శర్మలపై రెండు పాటలు చిత్రీకరించాం. శోభిమాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఇటలీలోని  టుస్కాన్ ,ఫ్లారెన్స్, డోలమైట్స్ ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. డోలమైట్స్ అనేది సముద్ర తీర పర్వత  ప్రాంతం. సముద్ర తీరానికి 10 వేలఅడుగుల ఎత్తులో మైనస్‌ ఐదు డిగ్రీల వాతావరణంలో ఒక పాటను చిత్రీకరించాం. డోలమైట్స్ లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు  చిత్రం   ఇదే! ఈ రెండు పాటలూ చాలా బాగా వచ్చాయి. అలాగే ఇటలీలో ప్రతి ఏటా సూపర్బ్ గా జరిగే వెనీడియా కార్నివాల్‌లో కూడా అనుమతి తీసుకుని పాటలో కొంత భాగాన్ని చిత్రీకరించాం. దీంతో ఒక పాట మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో ఆ పాట చిత్రీ కరిస్తాం'' అని తెలిపారు. 

Updated Date - 2020-02-21T21:12:02+05:30 IST