ఓటు హక్కు వినియోగించుకున్న రాజశేఖర్
ABN , First Publish Date - 2020-12-01T22:13:39+05:30 IST
హైదరాబాద్ బల్దియా బాద్‌షా ఎవరో నిర్ణయించే ఎన్నికలు నేడు (డిసెంబర్ 1) జరుగుతున్న విషయం తెలిసిందే. 150 డివిజన్స్‌లో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు

హైదరాబాద్ బల్దియా బాద్‌షా ఎవరో నిర్ణయించే ఎన్నికలు నేడు (డిసెంబర్ 1) జరుగుతున్న విషయం తెలిసిందే. 150 డివిజన్స్‌లో ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పలువురు సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంచుకున్నారు. ఇంకా నాగార్జున, అమల, రామ్, విజయ్ దేవరకొండ, బెల్లంకొండ శ్రీనివాస్ మొదలగు సెలబ్రిటీలెందరో తమ ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఉన్నారు. తాజాగా యాంగ్రీమెన్ రాజశేఖర్ తన భార్య జీవితతో కలిసి వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజశేఖర్ ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. ఫిల్మ్‌నగర్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ నందు రాజశేఖర్ మరియు జీవిత ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read more