హీరో నితిన్ పెళ్లిపై కరోనా ఎఫెక్ట్!

ABN , First Publish Date - 2020-03-08T09:24:53+05:30 IST

హీరో నితిన్‌ వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్ణయించిన వేదిక ప్రకారం ఏప్రిల్‌ 16న దుబాయ్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. కరోనా వైరస్‌ ప్రభావంతో

హీరో నితిన్ పెళ్లిపై కరోనా ఎఫెక్ట్!

కరోనా అదుపులోకొస్తే దుబాయ్‌లో.. లేదంటే హైదరాబాద్‌లో..

నాగర్‌కర్నూల్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): హీరో నితిన్‌ వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్ణయించిన వేదిక ప్రకారం ఏప్రిల్‌ 16న దుబాయ్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. కరోనా వైరస్‌ ప్రభావంతో దుబాయ్‌లోనే పెళ్లిని జరుపుతారా? అనుమానంగా మారింది. అయితే వివాహాన్ని వాయిదా వేయకుండా నిర్ణయించిన ముహూర్తానికే జరపాలని పెద్దలు నిర్ణయించారు. నాగర్‌కర్నూల్‌లోని ప్రగతి నర్సింగ్‌ హోమ్‌ నిర్వహిస్తున్న డాక్టర్‌ సంపత్‌కుమార్‌, నూర్జహాన్‌ దంపతుల రెండవ కుమార్తె షాలినితో నితిన్‌కు నిశ్చితార్థం జరిగింది. వధూవరుల బంధువులు, సినీ ప్రముఖుల మధ్య దుబాయ్‌లోని ప్రఖ్యాత హోటల్‌ ప్లహేజో వర్చ్‌సలో వచ్చేనెల 16న వివాహ వేడుక జరగాల్సి ఉంది.


పెళ్లి వేడుకల్లో భాగంగా ఇటీవల కంచి, చెన్నైలో వధూవరులు పెళ్లి దుస్తులు కూడా కొనుగోలు చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అరబ్‌ దేశాల్లో కఠినమైన ఆంక్షలు నెలకొన్న నేపథ్యంలో దుబాయ్‌లో జరగాల్సిన నితిన్‌ వివాహంపై సందిగ్ధత నెలకొంది. అప్పటి వరకు కరోనా వైరస్‌ పూర్తిగా అదుపులోకి వస్తే దుబాయ్‌లో లేకుంటే హైదరాబాద్‌లో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌ శివారులోని ఒక ఫామ్‌హౌజ్‌లో వివాహం జరిపించేందుకు వధూవరుల బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాబోయే 15 రోజుల్లో పరిస్థితిని బట్టి వివాహం దుబాయ్‌లో నిర్వహించాలా? లేదంటే హైదరాబాద్‌లోనా అనే విషయాన్ని ఫైనల్‌ చేయనున్నారు. పరిస్థితులు అనుకూలించకపోతే పరిమితమైన బంధువులు, సినీ ప్రముఖుల మధ్య హైదరాబాద్‌ శివారులో పెళ్లి జరిపించి ఏప్రిల్‌ 21న హైటెక్స్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది. 

Updated Date - 2020-03-08T09:24:53+05:30 IST