'సీతన్న పేట గేట్' టీజర్ విడుదల చేసిన హీరో నిఖిల్
ABN , First Publish Date - 2020-12-25T22:04:02+05:30 IST
సీతన్నపేట గేట్ టీజర్ ను శుక్రవారం హీరో నిఖిల్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి అబినందనలు తెలిపారు.

ఏయు అండ్ ఐ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎ. పద్మనాభ రెడ్డి నిర్మాణంలో రాజ్ కుమార్ దర్శకునిగా పరిచయం చేస్తూ వాస్తవ సంఘటనలు ఆధారంగా విజయవాడ బ్యాక్ డ్రాప్‌లో రూపోందిన క్రైమ్ సస్పెన్స్ డ్రామా 'సీతన్న పేట గేట్'. మనిషి లోని నేర ప్రవృత్తిని ఇతి వృత్తంగా వాటి పర్యవసానాల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా టీజర్‌ని శుక్రవారం హీరో నిఖిల్ లాంఛ్ చేసి టీమ్‌ని అభినందించారు. ఈ సందర్బంగా దర్శకుడు వై.రాజ్ కుమార్ మట్లాడుతూ "'సీతన్న పేట గేట్' చిత్రానికి సపోర్ట్ చేస్తూ టీజర్ విడుదల చేసిన నిఖిల్‌గారికి పెద్ద థ్యాంక్స్. నేను చూసిన, విన్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని కథగా మలచుకున్నాను. నా ప్రయాణంలో చాలా ఒడిదొడుకులున్నాయి. సినిమా ఔట్ పుట్ కూడా చాలా బాగా వచ్చింది. ఈజీ మనీ వెంట పరుగులు పెట్టే జీవితాలను తెరమీదకు తెచ్చాను. క్రైమ్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకుల ఆదరిస్తారనే నమ్మకం ఉంది" అన్నారు.
Read more