పెళ్లి కొడుకైన నిఖిల్!

ABN , First Publish Date - 2020-05-14T02:15:09+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు.

పెళ్లి కొడుకైన నిఖిల్!

యంగ్ హీరో నిఖిల్ మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. గురువారం ఉదయం 6:31 గంటలకు డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మను వివాహం చేసుకోనున్నాడు. మొదట ఈ పెళ్లికి ఏప్రిల్ 16న ముహూర్తం పెట్టారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా పెళ్లిని వాయిదా వేయక తప్పలేదు. 


పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఘనంగా పెళ్లి చేసుకోవాలని నిఖిల్ భావించాడు. అయితే లాక్‌డౌన్ త‌రువాత మూఢం రావ‌టం, ముహుర్తాలు లేక‌పోవ‌టం వ‌ల్ల గురువారం ఉదయం పెళ్లి చేసెయ్యాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూనే అతికొద్ది మంది అతిథుల సమక్షంలో షామిర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌లో ఈ పెళ్లి జరగనుంది. తాజాగా పెళ్లి పనులు మొదలయ్యాయి. నిఖిల్‌ను పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం పూర్తయింది.

ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2020-05-14T02:15:09+05:30 IST