‘ఆర్ఆర్ఆర్’లో చేయట్లేదు: నవదీప్

ABN , First Publish Date - 2020-04-16T21:28:33+05:30 IST

ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాపై రోజుకో వార్త సోషల్

‘ఆర్ఆర్ఆర్’లో చేయట్లేదు: నవదీప్

ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాపై రోజుకో వార్త సోషల్ మీడియాలో దర్శనమిస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఈ సినిమాలో మోహన్‌లాల్ నటిస్తున్నాడని, అలాగే తమిళ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్నాడని.. ఇలా వార్తలు విపరీతంగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. మాములుగా చిన్న సినిమాల విషయంలోనే అనేక వార్తలు పుట్టుకొస్తుంటే.. భారీ సినిమా అయిన ‘ఆర్ఆర్ఆర్’పై వార్తలు పుట్టుకురావడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే సోషల్ మీడియాలో తనపై వచ్చిన వార్తలకు హీరో నవదీప్ క్లారిటీ ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’లో నవదీప్ కూడా నటిస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి. దీనిపై నవదీప్ తాజాగా స్పందించాడు.


నేను ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదు. అలాంటి ఆఫర్ నాకు రాలేదు.. అంటూ నవదీప్ తెలిపాడు. సో.. ఇక మోహన్‌లాల్, విజయ్ నటిస్తున్నాడంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇన్ని పుట్టుకొస్తున్నా రాజమౌళి మాత్రం కామ్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు.

Updated Date - 2020-04-16T21:28:33+05:30 IST

Read more