సిక్స్ ప్యాక్ అనేది భార్య వంటిది: నాగశౌర్య

ABN , First Publish Date - 2020-07-29T00:06:55+05:30 IST

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి ప‌తాకాల‌పై ప్ర‌ముఖ నిర్మాత‌లు నారాయణదాస్

సిక్స్ ప్యాక్ అనేది భార్య వంటిది: నాగశౌర్య

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి ప‌తాకాల‌పై ప్ర‌ముఖ నిర్మాత‌లు నారాయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న నాగశౌర్య 20వ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. సూపర్ ఫిట్‌గా వెనుకనుండి కనిపిస్తున్న నాగశౌర్య20 ప్రీ లుక్‌ విశేష స్పందన రాబట్టి ఫస్ట్ లుక్ మీద అంచనాలు పెంచింది. ఆ అంచ‌నాల‌ను అందుకునేలా ఫ‌స్ట్‌లుక్‌ని డిజైన్ చేసింది చిత్ర యూనిట్. మెలితిరిగిన కండ‌ల‌తో చేతిలో బాణం ప‌ట్టుకుని వారియ‌ర్ పోజ్‌లో ఉన్న ఫ‌స్ట్ లుక్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. స‌రికొత్త‌గా క‌నిపిస్తోన్న హీరో నాగ‌శౌర్య లుక్ సూప‌ర్బ్ అని అంద‌రూ అప్రి‌షియేట్ చేస్తున్నారు. ప్రతి సినిమాలో తన స్పెషాలిటీని నిరూపించుకుంటూ ఛలో, ఓ బేబీ, అశ్వ‌థ్థామ వంటి సూప‌ర్‌ హిట్స్‌తో దూసుకెళ్తున్నయంగ్ హీరో నాగశౌర్య హీరోగా ఆసక్తికరమైన ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది.


అయితే హీరో నాగశౌర్య తాజాగా విడుదలైన తన లుక్‌పై స్పందించారు. సిక్స్‌ప్యాక్ అంటే భార్యతో సమానం అని తెలిపారు. జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర కథకు సిక్స్‌ ప్యాక్ చాలా అవసరం. అందుకే ఎంతో కష్టపడాల్సి వచ్చింది. నాలుగు నెలలు అసలు రైస్ జోలికి వెళ్లలేదు. ఇక సిక్స్ ప్యాక్ అంటే భార్యతో సమానం. చీట్ చేయాలని చూశారో.. దూరమైపోతుంది..’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2020-07-29T00:06:55+05:30 IST