ధనుష్ ‘జగమే తంత్రం’ ఫస్ట్ లుక్

ABN , First Publish Date - 2020-02-21T00:43:04+05:30 IST

‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’, ‘గేమ్ ఓవర్’ వంటి చిత్రాల‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు పొందిన ‘వై నాట్’ స్థూడియోస్ నిర్మాణంలో పాన్ ఇండియా

ధనుష్ ‘జగమే తంత్రం’ ఫస్ట్ లుక్

‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’, ‘గేమ్ ఓవర్’ వంటి చిత్రాల‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు పొందిన ‘వై నాట్’ స్థూడియోస్ నిర్మాణంలో పాన్ ఇండియా స్టార్‌గా ఇమేజ్ ఉన్న ధనుష్ హీరోగా.., ‘పిజ్జా, జిగర్‌తండా(చిక్కడు దొరకడు), పేట’ సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో డి40(ధ‌నుష్‌-40)గా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ.. గురువారం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘జగమే తంత్రం’ అనే డిఫరెంట్ టైటిల్‌ను ఈ సినిమాకు ఖరారు చేశారు. ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూరుస్తున్నారు. 


‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, గీత‌ గోవిందం, టాక్సీవాలా, ప్ర‌తిరోజూ పండ‌గే’ వంటి వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ని అందించిన నిర్మాణ సంస్థ‌లు జిఏ2 పిక్చ‌ర్స్‌, యువీ క్రియేష‌న్స్ ఇప్ప‌డు జిఏ2యువీ ద్వారా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్నారు. నిర్మాణ విలువ‌లు, మినిమ‌మ్ గ్యారెంటీ స‌బ్జ‌ెక్ట్స్‌తో అత్య‌ధిక స‌క్స‌ెస్‌రేట్‌తో దూసుకుపోతున్న ఈ రెండు సంస్ధ‌లు ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌ట‌మే డి40 ‘జగమే తంత్రం’ చిత్రానికి ఉన్న క్రేజ్‌ని తెలియ‌జేస్తుంది. సోషల్ మీడియాలో ‘జగమే తంత్రం’ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.Updated Date - 2020-02-21T00:43:04+05:30 IST