హలో చెన్నై!

ABN , First Publish Date - 2020-10-05T07:57:01+05:30 IST

కథానాయిక రాశీ ఖన్నా ఆదివారం హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లారు. ‘‘మళ్లీ పని(సినిమా చిత్రీకరణ)కి వెళ్తున్నా. హలో చెన్నై!’’ అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పేర్కొన్నారామె..

హలో చెన్నై!

కథానాయిక రాశీ ఖన్నా ఆదివారం హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లారు. ‘‘మళ్లీ పని(సినిమా చిత్రీకరణ)కి వెళ్తున్నా. హలో చెన్నై!’’ అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పేర్కొన్నారామె. లాక్‌డౌన్‌ తర్వాత ఆమె హైదరాబాద్‌ నుంచి బయట అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఓ తమిళ సినిమా చిత్రీకరణ కోసం చాలా రోజుల విరామం తర్వాత రాశీ ఖన్నా చెన్నై విమానం ఎక్కారు. కరోనా నేపథ్యంలో ముఖానికి మాస్క్‌ ధరించడంతో పాటు ఫేస్‌ షీల్డ్‌ ధరించి జాగ్రత్తలు తీసుకున్నారు. సుందర్‌ .సి నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్న హారర్‌ థ్రిల్లర్‌ ‘ఆరణ్మణై 3’లో రాశీ ఖన్నా నటిస్తున్నారు. అది కాకుండా మరో రెండు తమిళ చిత్రాలకు సంతకాలు చేశారామె. అలాగే, తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో నటించడానికి అంగీకరించినప్పటికీ... ఏవీ అధికారికంగా ప్రకటించలేదు.

Updated Date - 2020-10-05T07:57:01+05:30 IST

Read more