‘చావు కబురు చల్లగా’ షురూ!

ABN , First Publish Date - 2020-02-14T09:25:38+05:30 IST

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా అల్లు అరవింద్‌ సమర్పణలో ‘చావు కబురు చల్లగా’ చిత్రం గురువారం ఫిల్మ్‌నగర్‌ దైవ సన్నిధానంలో మొదలైంది. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్..

‘చావు కబురు చల్లగా’ షురూ!

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా అల్లు అరవింద్‌ సమర్పణలో ‘చావు కబురు చల్లగా’ చిత్రం గురువారం ఫిల్మ్‌నగర్‌  దైవ సన్నిధానంలో మొదలైంది. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి  బన్నీ వాసు నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌ మనమరాలు బేబి అన్విత క్లాప్‌ ఇవ్వగా, అల్లు ఆయాన్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఇందులో కార్తికేయ బస్తి బాలరాజు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ నెల 19 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. ఆమని, శ్రీకాంత్‌ అయ్యంగర్‌, మహేశ్‌, భద్రం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌ రెడ్డి, సంగీతం: జేక్స్‌ బిజోయ్‌, ఎడిటర్‌: సత్య, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌.. రాఘవ కరుటూరి. 


Updated Date - 2020-02-14T09:25:38+05:30 IST