ఎస్పీ బాలు ఆరోగ్యంపై తాజా అప్‌డేట్..
ABN , First Publish Date - 2020-08-25T03:28:05+05:30 IST
కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితికి...

కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితికి సంబంధించి చెన్నై ఎంజీఎం ఆసుపత్రి సోమవారం నాటి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. బాలుకు ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌పై చికిత్సనందిస్తున్నట్లు వైద్యులు హెల్త్ బులిటెన్‌లో ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంజీఎం ఆస్పత్రి ప్రకటించడం ఎస్పీబీ అభిమానులకు కొంత ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నారు. వైద్య నిపుణులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
Read more