అనసూయ మొదటి బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?

ABN , First Publish Date - 2020-05-26T01:10:45+05:30 IST

జ‌బ‌ర్దస్త్ షోతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్, ఇప్పుడు నటిగానూ వెండితెర అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ప్రస్తుత టాప్ యాంకర్స్‌లో

అనసూయ మొదటి బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?

జ‌బ‌ర్దస్త్ షోతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్, ఇప్పుడు నటిగానూ వెండితెర అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ప్రస్తుత టాప్ యాంకర్స్‌లో ఒకరిగా.. బిజీబిజీగా గడుపుతున్న అనసూయ తనకు మంచి పాత్ర అనిపిస్తే అస్సలు ఆలోచించకుండా చేసేస్తుంది. దాదాపు ఆమె చేసిన సినిమాలన్నీ మంచి హిట్స్‌గానే నిలిచాయి. ఇక ఆమె సోషల్ మీడియాలో చేసే హడావుడి కూడా మాములుగా ఉండదు. నెటిజన్లు ఎవరైనా ఆమెపై చెలరేగిపోవాలని చూస్తే వెంటనే కట్ చేస్తూ ఉంటుంది. ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టేసినట్లు మాట్లాడటం అనసూయకున్న మరో స్పెషాలిటీ. తాజాగా ఈ భామను ఓ నెటిజన్ మీ మొదటి బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతారా? అని అడిగాడు. దీనికి మాములుగా అయితే అనసూయ భగ్గుమంటుందని అంతా ఊహించారు. కానీ చాలా కూల్‌గా అనసూయ సమాధానమిచ్చింది.


ఈ ప్రశ్నకు అన‌సూయ సమాధానమిస్తూ.. ‘‘నా భ‌ర్త సుశాంక్ భ‌ర‌ద్వాజ్. అవును నా మొద‌టి, రెండు, మూడు.. ప్రస్తుతం మరియు భవిష్యత్ బాయ్ ఫ్రెండ్ కూడా ఆయనే. ఆయన నాకు బంధీ అయిపోయాడు.. ఫాఫం..’’ అని అనసూయ జవాబిచ్చింది. ఇటీవల అనసూయ తన లవ్ స్టోరీని తెలిపిన విషయం తెలిసిందే. పెద్దలను ఎదిరించి మరీ తను ప్రేమించిన సుశాంక్‌ను ఆమె వివాహమాడినట్లుగా ఆమె తెలిపింది. ఇక మొదటి బాయ్ ఫ్రెండ్ ఎవరు? అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానంతో అనసూయపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.Updated Date - 2020-05-26T01:10:45+05:30 IST