సుశాంత్ మృతికి కేంద్రమంత్రి సంతాపం

ABN , First Publish Date - 2020-06-15T00:22:15+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు.

సుశాంత్ మృతికి కేంద్రమంత్రి సంతాపం

పట్నా: బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మృతిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. సుశాంత్ మృతికి సంతాపం తెలిపిన ఆయన.. ‘సుశాంత్ మా సిటీ వాడే. ఇద్దరూ పట్నా నుంచే వచ్చాం. రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం సందర్భంగా కూడా కలిశా. ఇంకా ఎన్నో ఘనతలు సాధించాల్సిన వాడు. ఇలా అర్ధాంతరంగా అస్తమిస్తాడనుకోలేదు’ అని రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు.

Updated Date - 2020-06-15T00:22:15+05:30 IST