కైరా అద్వాని లేటెస్ట్‌ సాంగ్‌ ..ఇడియట్‌ ట్యూన్‌ను కాపీ కొట్టారుగా..!

ABN , First Publish Date - 2020-09-16T19:21:24+05:30 IST

కైరా తాజా చిత్రం 'ఇందూకి జవానీ'. లేడీ ఓరియెంటెడ్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను అభీర్‌సేన్‌ గుప్తా డైరెక్ట్‌ చేస్తున్నారు. మికా సింగ్‌ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ను బుధవారం రోజున చిత్ర యూనిట్‌ విడుదల చేసింది

కైరా అద్వాని లేటెస్ట్‌ సాంగ్‌ ..ఇడియట్‌ ట్యూన్‌ను కాపీ కొట్టారుగా..!

బాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్స్‌లో కైరా అద్వాని ఒకరు. తెలుగులోనూ మహేశ్‌తో 'భరత్ అనే నేను'‌, రామ్‌చరణ్‌తో 'వినయ విధేయరామ' చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఈమెతో సినిమాలు చేయడానికి అటు బాలీవుడ్ మేకర్స్‌, ఇటు టాలీవుడ్‌ మేకర్స్‌ ఆసక్తిని చూపుతున్నారు. ఈమె చేతినిండా సినిమాలున్నాయి. కాగా.. కైరా తాజా చిత్రం 'ఇందూకి జవానీ'. లేడీ ఓరియెంటెడ్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను అభీర్‌సేన్‌ గుప్తా డైరెక్ట్‌ చేస్తున్నారు. మికా సింగ్‌ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ను బుధవారం రోజున చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. 'హసీనా పాగల్ దివాని..' అంటూ సాగే ఈ పెప్పీ సాంగ్‌లో కైరాతో పాటు ఆదిత్య సియల్‌ నర్తించారు. ఈ సాంగ్‌ బాలీవుడ్‌ సినీ ప్రేక్షకులకు కొత్తగా ఉందేమో కానీ.. టాలీవుడ్‌ ప్రేక్షకులకు కొత్తేమీ కాదు.. ఎందుకంటే రవితేజ హీరోగా పూరి తెరకెక్కించిన 'ఇడియట్‌' సినిమాలో 'చూపుల్తో గుచ్చి గుచ్చి...' ట్యూన్‌ను పోలి ఉంది. ఈ సాంగ్‌ విన్న టాలీవుడ్‌ జనాలు.. ఇప్పుడు టాలీవుడ్‌ కంటెంట్‌పై ఆధాపడుతున్న బాలీవుడ్‌.. ఇప్పుడు ట్యూన్స్‌ విషయంలోనూ టాలీవుడ్‌పైనే డిపెండ్‌ కావాలా? అని గుసగుసలాడుకుంటున్నారు. 
Updated Date - 2020-09-16T19:21:24+05:30 IST