హరితేజ వయసు ఎంతో తెలుసా?
ABN , First Publish Date - 2020-05-01T20:47:49+05:30 IST
సీరియల్స్, బిగ్బాస్ వంటి కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన హరితేజ.. ఈ మధ్య కాలంలో వెండితెర మీద కూడా మెరుస్తోంది

సీరియల్స్, బిగ్బాస్ వంటి కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన హరితేజ.. ఈ మధ్య కాలంలో వెండితెర మీద కూడా మెరుస్తోంది. క్యారెక్టర్ నటిగా బిజీ అయింది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న హరితేజ తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. వారడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.
ఈ సందర్భంగా ఓ నెటిజన్ `మీ వయసు ఎంతో చెప్పగలరా?` అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన హరితేజ.. `నేను చెప్పినా మీరు నమ్మరు.. నమ్మినా వినరు.. విన్నా అర్థం చేసుకోరు.. నిజాలు ఎప్పుడూ నిష్ఠూరంగా ఉంటాయి.. అయినా చెబుతా.. నేను పుట్టిన తేదీ.. 24-02-1992`అని చెప్పింది. ``హిట్` సినిమాలో షీలా పాత్రలో నటించిన మీరు నిజంగా సిగరెట్ కాల్చారా?` అని మరో నెటిజన్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన హరితేజ.. `అవును.. నిజంగానే సిగరెట్ కాల్చాను. పాత్ర డిమాండ్ మేరకు తప్పలేదు` అని చెప్పింది. అలాగే `పాస్ ది బ్రష్ ఛాలెంజ్` పేరుతో ఓ స్పెషల్ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.