ఎన్‌కౌంట‌ర్ చేసినా బుద్ధి రావ‌డం లేదు: హ‌రీశ్ శంక‌ర్‌

ABN , First Publish Date - 2020-06-28T19:02:57+05:30 IST

‘మాన‌వ మృగాళ్ల‌ను ఎన్‌కౌంట‌ర్ చేసినా బుద్ధి రావ‌డం లేదు’ అని వాపోతున్నారు డైరెక్టర్ హరీశ్ శంకర్.

ఎన్‌కౌంట‌ర్ చేసినా బుద్ధి రావ‌డం లేదు:  హ‌రీశ్ శంక‌ర్‌

‘మాన‌వ మృగాళ్ల‌ను ఎన్‌కౌంట‌ర్ చేసినా బుద్ధి రావ‌డం లేదు’ అని వాపోతున్నారు డైరెక్టర్ హరీశ్ శంకర్. వివరాల్లోకెళ్తే..కొత్తగూడెంలో దేవిక అనే పదిహేడేళ్ల అమ్మాయిపై కిరాతకంగా అత్యాచారం చేసి, హత్య చేశారు. శవాన్ని రైల్వే ట్రాక్ దగ్గర పడేశారు. ఈ ఘ‌ట‌న‌పై కొందరు నెటిజ‌న్లు జస్టిస్ ఫర్ దేవిక అనే హ్యాష్ ట్యాగ్‌తో రైజ్ యువర్ వాయిస్ అంటూ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌, హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, హీరో నితిన్‌ల‌కు ట్వీట్ చేశారు. దీనిపై హ‌రీశ్ శంక‌ర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ‘ఎన్‌కౌంట‌ర్ చేసినా బుద్ధి రావ‌డం లేదు. అంటే ఇంకా పెద్ద ప‌నిష్‌మెంట్ ఏదైనా ఆలోచించాలేమో’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. హరీశ్ శంకర్ స్పందించినట్టు విజయ్ దేవ‌ర‌కొండ‌, నితిన్ ఏమైనా ఈ ఇష్యూపై స్పందిస్తారేమో చూడాలి.

Updated Date - 2020-06-28T19:02:57+05:30 IST