గొప్ప మనసు చాటుకున్న హరీష్ కల్యాణ్

ABN , First Publish Date - 2020-09-29T05:09:27+05:30 IST

తెలుగు, తమిళ చిత్రాలలో ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న హరీష్‌ కల్యాణ్ తన గొప్ప మనసును చాటుకున్నారు. నిస్సహాయ స్థితిలో

గొప్ప మనసు చాటుకున్న హరీష్ కల్యాణ్

తెలుగు, తమిళ చిత్రాలలో ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న హరీష్‌ కల్యాణ్ తన గొప్ప మనసును చాటుకున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న క్యాన్సర్ రోగులను, వారి చివరి క్షణాల వరకు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న శ్రీ మాతా క్యాన్సర్ కేర్‌కు ఆయన రూ. 3 లక్షల 70 వేలు విరాళం అందించారు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రమ్‌ ద్వారా తెలిపారు. 


''నిస్సహాయ స్థితిలో ఉన్న క్యాన్సర్ రోగులకు అండగా ఉంటూ.. వారి చివరి క్షణాల వరకు అక్కున చేర్చుకుంటున్న శ్రీ మాతా క్యాన్సర్‌ కేర్‌కు చెందిన శ్రీమతి విజయశ్రీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మానవ జాతి కోసం వారు చేస్తున్న సేవకు గానూ నావంతుగా ఈ సహాయం అందిస్తున్నాను. (వారి సేవ గురించి పబ్లిక్‌కి తెలియాలనే ఉద్ధేశ్యంతోనే ఇక్కడ తెలియజేయడం జరిగింది..)" అని హరీష్‌ కల్యాణ్ పేర్కొన్నారు.Updated Date - 2020-09-29T05:09:27+05:30 IST