దిల్ రాజుకు కూతురి విషెస్!

ABN , First Publish Date - 2020-05-11T15:39:57+05:30 IST

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆదివారం రాత్రి రెండో వివాహం చేసుకున్నారు.

దిల్ రాజుకు కూతురి విషెస్!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆదివారం రాత్రి రెండో వివాహం చేసుకున్నారు. సినీ కుటుంబానికి సంబంధం లేని మహిళతో దిల్ రాజు వివాహం ఆదివారం రాత్రి నిజామాబాద్‌లో నిరాడంబరంగా జరిగింది. 2017లో దిల్‌ రాజు భార్య అనిత గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఒంటరిగానే ఉంటున్న దిల్ రాజు.. కూతురు హన్సితా రెడ్డి బలవంతం మీద రెండో వివాహానికి అంగీరించినట్టు తెలుస్తోంది. 


వివాహం చేసుకున్న తండ్రికి హన్షితా రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. `నాన్నా.. అన్ని సమయాల్లోనూ నువ్వు నాకు అతి పెద్ద బలంగా నిలిచావు. ఎప్పుడూ నాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. మన కుటుంబ సంతోషమే నీకు అతి ముఖ్యమైనది. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించిన మీరిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి రోజూ నీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా` అంటూ హన్షిత పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-11T15:39:57+05:30 IST