గురుద‌త్ బ‌యోపిక్‌

ABN , First Publish Date - 2020-07-31T13:39:36+05:30 IST

బాలీవుడ్‌లో ఎన్నో క్లాసిక్ మూవీల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు గురుద‌త్‌. ‘షాహిబ్ బీవీ ఔర్ గులామ్‌, ప్యాసా, కాగ‌జ్ కే పూల్‌’ వంటి ఎన్నో మ‌రుపురాని చిత్రాల‌ను ఆయ‌న సినీ ప్రియుల‌కు అందించారు.

గురుద‌త్ బ‌యోపిక్‌

బాలీవుడ్‌లో ఎన్నో క్లాసిక్ మూవీల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు గురుద‌త్‌. ‘షాహిబ్ బీవీ ఔర్ గులామ్‌, ప్యాసా, కాగ‌జ్ కే పూల్‌’ వంటి ఎన్నో మ‌రుపురాని చిత్రాల‌ను ఆయ‌న సినీ ప్రియుల‌కు అందించారు. ఇప్పుడు ఈ దిగ్గజ ద‌ర్శ‌కుడి బ‌యోపిక్ రూపొంద‌నుంది. గురుద‌త్‌ డైరెక్ష‌న్‌లో రూపొందిన ‘ప్యాసా’ సినిమా టైటిల్‌నే.. బ‌యోపిక్‌కు పెట్ట‌నున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది.  భావ‌నా త‌ల్వార్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌డంతో పాటు శీత‌ల్ త‌ల్వార్‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మించ‌నున్నారు కూడా. త్వ‌ర‌లోనే ఇందులో న‌టించబోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల గురించి తెలియ‌జేస్తారు. 

Updated Date - 2020-07-31T13:39:36+05:30 IST