ఫ్యాన్సీ రేటుకి ‘గుర్తుందా శీతాకాలం’ ఆడియో రైట్స్
ABN , First Publish Date - 2020-08-25T02:17:32+05:30 IST
వరుసగా వినూత్న చిత్రాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకుంటున్న యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా, ఎవర్‌గ్రీన్ మిల్కీబ్యూటీ తమన్నా

వరుసగా వినూత్న చిత్రాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకుంటున్న యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా, ఎవర్‌గ్రీన్ మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా.. నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌పై నాగశేఖర్, భావన రవి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అతి త్వరలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా, ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోని 75 లక్షలకి ఫ్యాన్సీ ఆఫర్‌తో కన్నడలో నెం1 ఆడియో కంపెనీగా పేరున్న ఆనంద్ ఆడియో వారు సొంతం చేసుకోవటం విశేషం. అలాగే ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రంతో ఆనంద్ ఆడియో తెలుగు మార్కెట్‌కి పరిచయం అవుతున్నారు. స్వరవాణి కీరవాణి తనయుడు కాలభైరవ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు నాగశేఖర్ మాట్లాడుతూ.. ‘‘సత్యదేవ్, తమన్నా కాంబినేషన్ అనగానే తెలుగు సినిమా మార్కెట్‌లో వచ్చిన క్రేజ్ మాములుగా లేదు. నాకు కంగ్రాట్స్ చెబుతూ వచ్చిన కాల్స్‌కి లెక్క కూడా లేదు. ఇప్పటికే ఈ సినిమా సూపర్‌హిట్ అనే ఫీలింగ్‌ని కలిగించింది. ఇంకా చిత్రం ప్రారంభించలేదు అప్పుడే ఆడియోని కన్నడలో నెం1 ఆడియో కంపెనీ వారు ఆనంద్ ఆడియో తెలుగుకి మా చిత్రం ద్వారా పరిచయం అవడమే కాకుండా ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణిగారి కుమారుడు కాలభైరవ అందిస్తున్న మ్యూజిక్‌ని ఫ్యాన్సీ రేట్‌కి 75 లక్షలకి కొనుగోలు చేయటం ఈ చిత్రం యొక్క మొదటి రికార్డ్ అనే చెప్పాలి. ఈ క్రేజీ కాంబినేషన్‌కి క్రేజీ లవ్‌స్టోరీకి టైటిల్ ఏం పెట్టాలి అనుకుంటున్న సమయంలో ‘గుర్తుందా శీతాకాలం’ అనే అచ్చ తెలుగు టైటిల్ మా మదిలో మెదిలింది. ఈ టైటిల్ విన్న వారంతా క్రేజీగా ఫీలవుతున్నారు. ఈ చిత్రానికి యాప్ట్ టైటిల్‌గా చెబుతున్నారు. చాలా ప్రేమకథలు శీతాకాలంలోనే మెదలవుతాయి. అందుకే గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ అనగానే ప్రతిఒక్కరూ వారి ప్రేమకథని గుర్తుచేసుకుంటున్నారు. చాలా పొయోటిక్‌గా ఈ టైటిల్ ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయింది. అతి త్వరలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాము..’’ అని అన్నారు.
Read more