బుల్లితెర నటులకు వెండితెర తలుపులు తీసిన సుశాంత్ : నటుడు గుర్మీత్
ABN , First Publish Date - 2020-08-08T18:20:29+05:30 IST
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య అనంతరం పలువురు నటులు చిత్రపరిశ్రమలో తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందు వెళ్లగక్కుతున్నారు. తాజాగా హిందీ టీవీ నటుడు ...

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య అనంతరం పలువురు నటులు చిత్రపరిశ్రమలో తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందు వెళ్లగక్కుతున్నారు. తాజాగా హిందీ టీవీ నటుడు గుర్మీత్... హీరో సుశాంత్ గురించిన పలు విషయాలు తెలిపారు. మీడియాతో గుర్మీత్ మాట్లాడుతూ సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ముందు టీవీలో నటిస్తే, టిక్కెట్ కొనుక్కొని వారిని వెండితెరపై ఎవరూ చూడరని చాలామంది వ్యాఖ్యానిస్తుంటారని తెలిపారు. అయితే ఇటువంటి వ్యాఖ్యానాలను సుశాంత్ తుడిచిపెట్టేశారని అన్నారు. తాను టీవీరంగంలో పేరు సంపాదించాక, వెండితెరపై ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు తనను టీవీస్టార్ అని అనేవారని తెలిపారు. ఈ నేపధ్యంలో పలు సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపారు. అయితే ఎప్పుడైతే సుశాంత్ టీవీ రంగం నుంచి సినిమాల్లోకి వెళ్లారో, అప్పటినుంచి అందరి ఆలోచనా విధానం మారిపోయిందన్నారు. టీవీ తారలకు కూడా థియేటర్లలో ప్రేక్షకులు ఉంటారని సుశాంత్ నిరూపించారన్నారు.