‘గుండ‌మ్మ క‌థ’ ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల‌

ABN , First Publish Date - 2020-06-12T19:06:45+05:30 IST

ఆదిత్య క్రియెష‌న్స్‌ ప‌తాకం పై ఆదిత్య‌, ప్ర‌ణ‌వ్య‌లు జంట‌గా తెర‌కెక్కుతున్న ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ‘గుండ‌మ్మ క‌థ‌’.

‘గుండ‌మ్మ క‌థ’ ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల‌

ఆదిత్య క్రియెష‌న్స్‌ ప‌తాకం పై ఆదిత్య‌, ప్ర‌ణ‌వ్య‌లు జంట‌గా తెర‌కెక్కుతున్న ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ‘గుండ‌మ్మ క‌థ‌’. ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ స్వీయ నిర్మాణంలో కృష్ణంరాజు ద‌ర్శ‌కునిగా తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్‌ని ఇటీవ‌లే విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఈ సినిమా ఆడియో ఆల్బ‌మ్ నుంచి ఫ‌స్ట్ సింగిల్‌ను శుక్రవారం విడుద‌ల చేశారు. స‌తీష్ సాధ‌న్ సంగీతం అందించారు. రింగ్ ట్రింగ్ అంటూ సాగిపోయో ఈ పాట‌కు లిరిక్స్ వేగ్నేశ్న శ్రీ విజ‌య అందించారు. అనురాగ్ కుల‌క‌ర్ణి ఈ పాట‌ను ఆల‌పించారు. ల‌వ్, కామెడీ, సెంటిమెంట్ త‌దిత‌ర అంశాల ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు చిత్ర బృందం తెలిపింది. క‌‌రోనా నేప‌థ్యంలో థియేట‌ర్స్ లాక్ డౌన్ ముగిసిన వెంట‌నే ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.


Updated Date - 2020-06-12T19:06:45+05:30 IST