'సాహో'ని బీట్‌ చేసిన 'గుణ 369'

ABN , First Publish Date - 2020-10-30T03:58:23+05:30 IST

అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో ఆర్‌ఎక్స్‌ 100 హీరో కార్తికేయ గుమ్మకొండ నటించిన చిత్రం 'గుణ 369'. ఈ చిత్రం 2019 ఆగస్ట్‌లో విడుదలైంది. రీసెంట్‌గా

'సాహో'ని బీట్‌ చేసిన 'గుణ 369'

అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో ఆర్‌ఎక్స్‌ 100 హీరో కార్తికేయ గుమ్మకొండ నటించిన చిత్రం 'గుణ 369'. ఈ చిత్రం 2019 ఆగస్ట్‌లో విడుదలైంది. రీసెంట్‌గా ఈ చిత్రం తెలుగు బుల్లితెరపై ప్రసారమైంది. అదే రోజు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన 'సాహో' చిత్రం కూడా బుల్లితెరపై ప్రసారమైంది. అయితే ప్రభాస్‌ 'సాహో'ని బీట్‌ చేసి మరీ 'గుణ 369' చిత్రం అత్యధిక టీఆర్పీ సాధించడం విశేషం.


ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌ హీరోహీరోయిన్లుగా సుజీత్‌ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'సాహో' చిత్రం 5.8 టీర్పీ సాధించగా.. కార్తికేయ 'గుణ 369' చిత్రం 5.92 టీఆర్పీని సాధించినట్లుగా అధికారికంగా ప్రకటించారు. గుణ 369 చిత్ర కథ విషయానికి వస్తే.. స్నేహితునికి సహాయం చేయబోయి.. హీరో ఇబ్బందుల్లో పడతాడు. ఆ స్నేహితుని పగ కారణంగా తన జీవితం నాశనం అవ్వడమే కాకుండా.. తన స్నేహితుడే దుర్మార్గుడని తెలిసిన గుణ.. తన జీవితం నాశనం కావడానికి కారణమైన వారిని ఏం చేశాడు? అనేదే కథ. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దారుణాలను కళ్లకు కట్టినట్లు చూపించడమే కాకుండా.. దానికి పరిష్కారం కూడా ఇలా ఉండాలి అనే విధంగా దర్శకుడు అర్జున్‌ జంధ్యాల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

Updated Date - 2020-10-30T03:58:23+05:30 IST