ఆకుపచ్చ భారతాన్ని భావితరాలకు అందించాలి!
ABN , First Publish Date - 2020-07-27T12:16:22+05:30 IST
‘‘మొక్కలు నాటి ఆకుపచ్చ భారతాన్ని భావితరాలకు అందించడమే గొప్ప సంపద’’ అని చిరంజీవి అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్ప కార్యక్రమమని దాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌కు...

బోయపాటి శ్రీను, పవన్‌కల్యాణ్‌తో...
చిరంజీవితో ఎంపీ సంతోష్‌కుమార్ సెల్ఫీ... చిత్రంలో అనిల్ రావిపూడి
‘‘మొక్కలు నాటి ఆకుపచ్చ భారతాన్ని భావితరాలకు అందించడమే గొప్ప సంపద’’ అని చిరంజీవి అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్ప కార్యక్రమమని దాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్ ఇంటర్‌నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. సొసైటీ చైర్మన్ నరేంద్ర చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని జోగినిపల్లి సంతోష్ కుమార్, చిరంజీవి, పవన్‌కల్యాణ్, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘గతంలో కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నా. మరోసారి ఈ కార్యక్రమంలో భాగం కావడం ఆనందంగా ఉంది. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మెగా అభిమానులందరూ మొక్కలు నాటాలి. అదే మనం పుడమి తల్లికి తిరిగి ఇచ్చే ప్రత్యుపకారం’’ అని పేర్కొన్నారు. ‘‘నేనూ ప్రకృతి ప్రేమికుడినే! పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఆలోచన, పచ్చదనాన్ని పెంచాలని స్పృహ ఉన్నవాడిని. దుబాయ్ లాంటి దేశంలో పచ్చదనం కోసం చాలా కష్టపడతారు. సౌత్ ఆఫ్రికాలో గడ్డి మొక్కలను కూడా అపురూపంగా పెంచుకుంటారు. మనకు మొక్కలు నాటే అవకాశం చాలా ఉంది’’ అని ఈ కార్యక్రమంలో భాగమైన పవన్‌కల్యాణ్ అన్నారు.
Read more