బిగ్‌బీ కోసం 15 ఏళ్లుగా బ‌రేలీ అమితాబ‌చ్చ‌న్ వ్ర‌తం!

ABN , First Publish Date - 2020-07-16T12:13:36+05:30 IST

బాలీవుడ్ న‌టుడు అమితాబ్ బచ్చన్ కరోనా పాజిటివ్ అని తేల‌డంతో, ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. ఇదే కోవ‌లో యూపీలోని బరేలీకి చెందిన ఒక అభిమాని అమితాబ్...

బిగ్‌బీ కోసం 15 ఏళ్లుగా బ‌రేలీ అమితాబ‌చ్చ‌న్ వ్ర‌తం!

బ‌రేలీ: బాలీవుడ్ న‌టుడు అమితాబ్ బచ్చన్ కరోనా పాజిటివ్ అని తేల‌డంతో, ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. ఇదే కోవ‌లో యూపీలోని బరేలీకి చెందిన ఒక అభిమాని అమితాబ్ కోసం ప్రార్థ‌న‌ల‌ను సాగిస్తున్నారు. ఇత‌నిని  స్థానికులు బరేలీ అమితాబ‌చ్చ‌న్ అని పిలుస్తుంటారు. పైగా ఇత‌నిలో బిగ్‌బీ పోలిక‌లు క‌నిపిస్తుంటాయి. బరేలీకి చెందిన గోవర్ధన్ అనే ఈ అభిమాని గ‌త‌ 15 సంవత్సరాలుగా అమితాబ్ బచ్చన్ కోసం కర్వాచౌత్ వ్ర‌తం చేప‌డుతున్నారు. అమితాబ్ వేషధారణను గోవ‌ర్ధన్ అనుక‌రిస్తుంటారు. అమితాబ్ కరోనా పాజిటివ్‌గా మారార‌ని తెలుసుకున్న గోవ‌ర్థ‌న్  అప్పటినుంచి బిగ్‌బీ ఆరోగ్యం కోసం పూజలు, ప్రార్థనలకు చేస్తున్నారు. గోవర్ధన్ 2010లో ముంబైలో అమితాబ్‌ను కలిశారు. అప్పుడు అమితాబ్ ఆయ‌న‌ను ఆప్యాయంగా ఆలింగ‌నం చేసుకున్నారు. 

Updated Date - 2020-07-16T12:13:36+05:30 IST