‘క్రాక్‌’పై డైరెక్ట‌ర్ క్లారిటీ

ABN , First Publish Date - 2020-08-14T17:15:02+05:30 IST

‘క్రాక్’ సినిమా ఓటీటీలో విడుల‌వుతుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌పై ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

‘క్రాక్‌’పై డైరెక్ట‌ర్ క్లారిటీ

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘క్రాక్’. పదిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. కరోనా వైర‌స్ వ‌ల్ల ఏర్ప‌డ్డ ప‌రిస్థితులు కాస్త స‌ద్దుమ‌ణిగాక‌.. సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తామ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చిత్ర ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని తెలిపారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో కొన్ని చిత్రాలు ఓటీటీల్లో విడుల‌య్యాయి. ఆ క్ర‌మంలో ‘క్రాక్‌’ చిత్రాన్ని కూడా ఓటీటీలోనే విడుద‌ల చేస్తారంటూ వార్త‌లు వినిపించాయి. నిర్మాత ఠాగూర్ మ‌ధు అలాంటిదేమీ లేద‌ని క్లారిటీ ఇచ్చారు. మ‌ళ్లీ మ‌రోసారి ‘క్రాక్’ సినిమా ఓటీటీలో విడుల‌వుతుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌పై ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ‘క్రాక్‌’ సినిమా థియేట‌ర్లలోనే విడుద‌ల‌వుతుంద‌ని ఆయ‌న తెలిపారు. డాన్‌శీను, బ‌లుపు చిత్రాల త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. శృతి హాస‌న్ హీరోయిన్‌. ర‌వితేజ‌, శృతిహాస‌న్‌, గోపీచంద్ మ‌లినేని కాంబోలో రూపొందుతోన్న రెండో చిత్ర‌మిది. Updated Date - 2020-08-14T17:15:02+05:30 IST