అనుష్క శర్మకు గూగుల్ షాక్
ABN , First Publish Date - 2020-10-12T19:42:55+05:30 IST
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ హీరోయిన్ అయిన అనుష్క శర్మకు గూగుల్ పెద్ద షాకే ఇచ్చింది.

భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ హీరోయిన్ అయిన అనుష్క శర్మకు గూగుల్ పెద్ద షాకే ఇచ్చింది. ఇంతకూ అనుష్క శర్మకు గూగుల్ ఇచ్చిన షాక్ ఏంటంటే.. అఫ్ఘనిస్థాన్ క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న రషీద్ ఖాన్ భార్య ఎవరంటూ గూగుల్‌లో సెర్చ్ చేస్తే అనుష్క శర్మ పేరు వస్తుంది. గూగుల్ అలా చూపించడానికి కారణమిదేనంటూ కూడా కొన్ని వివరణాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఓసారి రషీద్‌ఖాన్ తన ఇంటర్వ్యూలో అభిమానులతో చాట్ చేస్తున్నారు. అప్పుడు మీకు ఇష్టమైన హీరోయిన్స్ ఎవరు? అని ఓ అభిమాని అడగ్గా రషీద్‌ఖాన్.. అనుష్క శర్మ, ప్రీతిజింతా పేర్లను చెప్పారు. అప్పుడు వెబ్‌సైట్స్ అన్నీ క్రికెటర్ రషీద్ ఖాన్ మన అనుష్క శర్మకు పెద్ద అభిమాని అంటూ వార్తలను రాశాయి. ఆ కారణంగా ఇప్పుడు రషీద్ ఖాన్ భార్య ఎవరు అని సెర్చ్ చేస్తే అనుష్క శర్మ పేరు వస్తుంది. మరి గూగుల్ తన తప్పును దిద్దుకుంటుందో లేదో చూడాలి.