‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ మీమ్ పోస్టర్‌కి మంచి స్పందన

ABN , First Publish Date - 2020-04-20T21:04:53+05:30 IST

‘రాజావారు రాణిగారు’ సినిమాతో ఆకట్టుకున్న యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం నుంచి ‘ఎస్ఆర్ కళ్యాణమండపం - ఈఎస్టీ. 1975’ అనే క్రైమ్ కామెడీ ల‌వ్ స్టోరీ వ‌స్తున్న

‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ మీమ్ పోస్టర్‌కి మంచి స్పందన

‘రాజావారు రాణిగారు’ సినిమాతో ఆకట్టుకున్న యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం నుంచి ‘ఎస్ఆర్ కళ్యాణమండపం - ఈఎస్టీ. 1975’  అనే క్రైమ్ కామెడీ ల‌వ్ స్టోరీ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్క‌ర్ న‌టిస్తోంది. ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకంపై రాజు, ప్ర‌మోద్‌లు నిర్మిస్తున్న‌ ఈ చిత్రం ద్వారా శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వినూత్న‌మైన టైటిల్ పెట్టి ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేపిన ఈ చిత్ర బృందం తాజాగా చిత్ర మీమ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో మీమ్స్ ఎంత పాపుల‌ర్ అయ్యాయో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే, చెప్పాల‌నుకున్న విష‌యాన్ని సూటిగా చెప్ప‌డ‌మే కాకుండా, ఈ మీమ్స్‌లో హ్యూమ‌ర్ కూడా ఉండ‌టం విశేషం. ఇదే ఫార్మాట్‌ని ‘ఎస్ఆర్ కళ్యాణమండపం - ఈఎస్టీ. 1975’ టీమ్ కూడా ఫాలో అయింది. 


తెలుగు చల‌న చిత్ర సీమ‌లో తొలిసారిగా మీమ్స్ టెంప్లేట్‌ని ఉప‌యోగించి అఫిషీయ‌ల్‌గా పోస్టర్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లుగానే ఈ సినిమాలో హీరో హీరోయిన్లు కాలేజీ స్టూడెంట్స్‌గా న‌టిస్తున్నార‌నే విష‌యాన్ని మ‌రోసారి ఈ మీమ్ పోస్ట‌ర్ ద్వారా ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ ఆడియెన్స్‌కి రివీల్ చేశారు. హ్యూమ‌ర్, రొమాన్స్, ఫ‌న్ జోడించిన డైలాగ్స్‌తో ఈ మీమ్ పోస్టర్ రెడీ చేశారు ‘ఎస్ఆర్ కళ్యాణమండపం - ఈఎస్టీ. 1975’ టీమ్. ఈ పోస్ట‌ర్‌కి సోష‌ల్ మీడియాలో అనుహ్య‌మైన స్పంద‌న రావ‌డ‌మే కాకుండా వైరల్ అవుతుంద‌ని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలో సాయికుమార్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇక లాక్‌డౌన్ పిరియ‌డ్ ముగిసిన వెంట‌నే ఈ సినిమా షూటింగ్‌ని పునః ప్రారంభించి సాధ్య‌మైనంత త్వ‌ర‌లో రిలీజ్ చేసే ప్లానింగ్‌లో ఉన్నామని నిర్మాత‌లు రాజు - ప్ర‌మోద్ తెలిపారు. 

Updated Date - 2020-04-20T21:04:53+05:30 IST