‘మ్యాడ్’ మూవీ కైలాష్ ఖేర్ సుఫీ పాటకి మంచి స్పంద‌న

ABN , First Publish Date - 2020-05-27T20:46:19+05:30 IST

ప్రస్తుత జనరేషన్‌ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం ‘మ్యాడ్’. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని రీసెంట్‌గా రిలీజ్ చేసింది చిత్రయూనిట్

‘మ్యాడ్’ మూవీ కైలాష్ ఖేర్ సుఫీ పాటకి మంచి స్పంద‌న

ప్రస్తుత జనరేషన్‌ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం ‘మ్యాడ్’. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని రీసెంట్‌గా రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఫ‌స్ట్ లుక్‌తో ఎట్రాక్ట్ చేసిన మ్యాడ్ మూవీ ఈసారి సుఫీతో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. తెలుగు పాట‌ల‌లో చాలా అరుదుగా క‌నిపించే సుఫీ పాట‌ మ్యాడ్‌కి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుందని చిత్రయూనిట్ ఆశించినట్లుగానే ఆ పాటకు మంచి స్పందన వస్తుంది. ‘‘బందిషీ ఖాత‌ల్ దిల్ కీ’’ అంటూ సాగే ఈ పాట కైలాష్ ఖేర్ గొంతులో ప్రాణం పోసుకుంది. సింగ‌ర్‌గా ఇండియ‌న్ మ్యూజిక్ పై చెరిగిపోని సంత‌కం చేసిన కైలాష్ ఖేర్ గొంతు తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులో శాశ్వత స్థానం సంపాదించుకుంది. మోహిత్ రెహ్మానిక్ స్వ‌ర ప‌ర‌చిన ఈ సుఫీని శ్రీమాన్‌శ్రీమ‌న‌స్వి ర‌చించారు.


మోదెల టాకీస్ బ్యాన‌ర్‌పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు మిత్రులు నిర్మాత‌లుగా లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటుంది. త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమాలో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ లీడ్ రోల్స్ ప్లే చేశారు.ఈ సంద‌ర్బంగా డైరెక్టర్ లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ.. ‘‘కైలాష్ ఖేర్‌గారు మా పాట‌ను ఒప్పుకోవ‌డం చాలా అదృష్టంగా భావించాము. సినిమాలో ఒక ఎమోష‌న‌ల్ సిట్యువేష‌న్‌లో ఈ పాట వ‌స్తుంది. క‌థలోని ఫీల్‌ని ఎస్టాబ్లిష్ చేసేందుకు సుఫీ అయితే కొత్తగా ఉంటుంది, చాలా ప్రెష్ ఫీల్ క‌లుగుతుంద‌ని అనుకున్నాం. మా మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఇచ్చిన ట్యూన్ చాలా హార్ట్ ట‌చ్చింగ్‌గా ఉంది. కైలాష్ ఖేర్‌గారు పాట విన్నాక మాకు క‌లిగిన ఆనందం అంతా ఇంతాకాదు.. సినిమాకు ఈ సాంగ్ హైలెట్‌గా మారుతుంద‌ని మా న‌మ్మ‌కం. ఒక రియ‌లిస్టిక్ అప్రోచ్‌లో క‌థా, క‌థ‌నాలు సాగుతాయి. ఈ జ‌న‌రేష‌న్ ప్రేమ‌క‌థ‌ల‌లో మ‌నం నిత్యం చూసే క‌థ‌లే ఇందులో చూపించాం..’’ అని అన్నారు.

Updated Date - 2020-05-27T20:46:19+05:30 IST