అదృష్టం.. ఆయుష్షు ఉండాలి
ABN , First Publish Date - 2020-12-21T07:03:48+05:30 IST
డాన్స్ మాస్టర్ సన్నీ కోమలపాటి దర్శకుడిగా మారి రూపొందిస్తున్న చిత్రం ‘ఎస్ 5’. నో ఎగ్జిట్ అన్నది ఉపశీర్షిక. సాయి కుమార్, అలీ, నందమూరి తారకరత్న, సునీల్, ప్రిన్స్...

డాన్స్ మాస్టర్ సన్నీ కోమలపాటి దర్శకుడిగా మారి రూపొందిస్తున్న చిత్రం ‘ఎస్ 5’. నో ఎగ్జిట్ అన్నది ఉపశీర్షిక. సాయి కుమార్, అలీ, నందమూరి తారకరత్న, సునీల్, ప్రిన్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గౌతమ్ కొండెపూడి నిర్మాత. శనివారం ఈ చిత్రం టీజర్‌ను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో నిర్మాత సి. కళ్యాణ్, ఉషా మూల్పూరి ఆవిష్కరించారు. సన్నీ మాట్లాడుతూ ‘‘హారర్ నేపథ్యంలో సాగే కామెడీ సినిమా ఇది. ఓ ట్రైన్‌లో కథ నడుస్తుంది. రెడ్ రేంజర్ కెమెరాతో పిక్చరైజ్ చేశాం. మణిశర్మగారు సంగీతం అందించడమే మాకు పెద్ద సక్సెస్’’ అని అన్నారు. గౌతమ్ కొండెపూడి మాట్లాడుతూ ‘‘కథ లాక్ అయ్యాక 25 రోజుల్లో సెట్ వేశాం. 34 రోజులు సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేశాం. అలీ మా చిత్రానికి ప్రాణం పోశారు. సినిమాలో కనీసం గంట ేసపు నవ్విస్తారు’’ అని అన్నారు. ‘‘ఎస్ 5 బోగిలోకి ఎక్కాలంటే అదృష్టం ఉండాలి, ఆ బోగిలో నుంచి దిగాలంటే ఆయుష్షు ఉండాలి. సింపుల్‌గా ఈ సినిమా కథ ఇది’’ అని రచయిత కళ్యాణ్ చక్రవర్తి చెప్పారు.
Read more