ధనుష్, సూర్య చిత్రాలకు అరుదైన గౌరవం!

ABN , First Publish Date - 2020-12-21T18:03:48+05:30 IST

సూర్య నటించిన `ఆకాశం నీ హద్దురా`, ధనుష్ `అసురన్`, మలయాళ `జల్లికట్టు` చిత్రాలు అరుదైన ఘనత సాధించాయి.

ధనుష్, సూర్య చిత్రాలకు అరుదైన గౌరవం!

సూర్య నటించిన `ఆకాశం నీ హద్దురా`, ధనుష్ `అసురన్`, మలయాళ `జల్లికట్టు` చిత్రాలు అరుదైన ఘనత సాధించాయి. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల పరిశీలనకు అర్హత సాధించాయి. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కూడా విజయం సాధించాయి.


సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన `ఆకాశం నీ హద్దురా` తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. ఇక, వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన `అసురన్` జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. వెంకటేష్ హీరోగా తెలుగులోకి రీమేక్ అవుతోంది. ఇక, `జల్లికట్టు` చిత్రం ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. ఈ మూడు చిత్రాలు వచ్చే జనవరిలో లాస్ ఏంజెలెస్‌లో ప్రదర్శితం కాబోతున్నాయి. 


Updated Date - 2020-12-21T18:03:48+05:30 IST