థియేటర్‌కు వెళ్లడం కూడా అలాంటిదే

ABN , First Publish Date - 2020-12-25T05:45:25+05:30 IST

‘‘ఇంట్లో పూజ గది ఉన్నా గుడికి వెళతాం. వైన్‌ బాటిల్‌ ఉన్నా బార్‌కు వెళ్తాం. ఇంట్లో ఓటీటీలు, టీవీలు ఉన్నా థియేటర్‌కు వెళ్లడం కూడా...

థియేటర్‌కు వెళ్లడం కూడా అలాంటిదే

‘‘ఇంట్లో పూజ గది ఉన్నా గుడికి వెళతాం. వైన్‌ బాటిల్‌ ఉన్నా బార్‌కు వెళ్తాం. ఇంట్లో ఓటీటీలు, టీవీలు ఉన్నా థియేటర్‌కు వెళ్లడం కూడా అలాంటిదే. ప్రేక్షకులు మాస్క్‌లు ధరించి సామాజిక దూరం పాటిస్తూ మా ‘రెడ్‌’ సినిమాను చూసి ఎంజాయ్‌ చేయాలి. ఎంజాయ్‌మెంట్‌ ఎంజాయ్‌మెంటే... సేఫ్టీ సేఫ్టీనే దేనికదే’’ అన్నారు హీరో రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా డబుల్‌ రోల్‌ చేసిన చిత్రం ‘రె డ్‌’. కిశోర్‌ తిరుమల దర్శకుడు. స్రవంతి రవికిషోర్‌ నిర్మాత. సంక్రాంతికి ‘రెడ్‌’ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో మూవీ థియేట్రికల్‌ ట్రైలర్‌ను నిర్మాత దిల్‌ రాజు లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ‘‘తొమ్మిది నెలల తర్వాత థియేటర్‌లు తెరుచుకుంటున్నాయి.  ‘రెడ్‌’ చిత్రంతో దర్శకుడు కిషోర్‌ విశ్వరూపం చూపించబోతున్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత రామ్‌కు ఈ చిత్రం మరో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది. ఈ పండుగకు విడుదలవుతున్న అన్ని సినిమాలు కుమ్మేయాలి’’ అన్నారు.

Updated Date - 2020-12-25T05:45:25+05:30 IST