గాడ్ ఈజ్ గ్రేట్.. : అమితాబ్

ABN , First Publish Date - 2020-08-08T23:50:52+05:30 IST

బచ్చన్ ఫ్యామిలీ కరోనా మహమ్మారిని జయించింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్‌కు కరోనా పాజిటివ్ అని తెలియగానే సినీ ప్రపంచం ఎలా రియాక్ట్ అయిందో

గాడ్ ఈజ్ గ్రేట్.. : అమితాబ్

బచ్చన్ ఫ్యామిలీ కరోనా మహమ్మారిని జయించింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్‌కు కరోనా పాజిటివ్ అని తెలియగానే సినీ ప్రపంచం ఎలా రియాక్ట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అభిషేక్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలకు కూడా పాజిటివ్ అని, జయా బచ్చన్ ఒక్కరికే నెగిటివ్ అని రిపోర్ట్స్ రావడంతో.. ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా అమితాబ్ విషయంలోనే అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వయసు రీత్యా.. ఈ మహమ్మారిని ఎదుర్కొని.. క్షేమంగా కోలుకొని బయటికి రావాలని అందరూ ఎంతగానో ప్రార్థించారు. ప్రార్థనలు ఫలించి ఆయన, అలాగే ఆయన ఫ్యామిలీ క్షేమంగా కరోనా బారి నుంచి సేఫ్ అయ్యారు. అయితే బిగ్ బి, ఆయన కోడలు, మనవరాలు క్షేమంగా వచ్చినా.. అభిషేక్ విషయంలో మాత్రం కరోనా మరికొన్ని రోజులు పరీక్ష పెట్టింది. ఆ పరీక్ష‌ను కూడా జయించి అభిషేక్ శనివారం ఇంటికి చేరుకున్నారు. తన కుమారుడికి నెగిటివ్ వచ్చిందనే విషయం చెబుతూ.. బిగ్ బి అమితాబ్ ట్వీట్ చేశారు. 


‘‘అభిషేక్ బచ్చన్‌కు ఈ రోజు టెస్ట్‌లో నెగిటివ్ వచ్చింది. హాస్పటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంటికి వచ్చేస్తున్నారు. గాడ్ ఈజ్ గ్రేట్. మా కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్క అభిమానికి, శ్రేయోభిలాషికి ధన్యవాదాలు..’’ అని అమితాబ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. Updated Date - 2020-08-08T23:50:52+05:30 IST

Read more