ఇలియానా టాలీవుడ్‌కి సిగ్నల్స్ పంపుతుందట

ABN , First Publish Date - 2020-07-12T03:09:59+05:30 IST

ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి నటించిన గోవా బ్యూటీ ఇలియానా.. ఇప్పుడు సినిమా అవకాశాలు లేక హాట్ ఫొటోలతో కనువిందు చేసే ప్రయత్నం

ఇలియానా టాలీవుడ్‌కి సిగ్నల్స్ పంపుతుందట

ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి నటించిన గోవా బ్యూటీ ఇలియానా.. ఇప్పుడు సినిమా అవకాశాలు లేక హాట్ ఫొటోలతో కనువిందు చేసే ప్రయత్నం చేస్తుంది. వైవీఎస్ చౌదరి ‘దేవదాసు’తో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ భామ ‘పోకిరి’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. రాఖీ, జల్సా, కిక్, జులాయి వంటి హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న టైమ్‌లో ఈ భామ బాలీవుడ్ బాట పట్టి మళ్లీ టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. వెళుతూ వెళుతూ టాలీవుడ్‌పై కొన్ని ఆరోపణలు కూడా చేసింది. ఆ మధ్య మళ్లీ రవితేజ చిత్రంతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది కానీ.. ఆ చిత్రం అనూహ్య పరాజయం చెందడంతో మళ్లీ టాలీవుడ్ గురించి ఆమె ఎక్కడా ప్రస్తావించలేదు. ఇక బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత అమ్మడి పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. వెళ్లిన కొత్తలో అవకాశాలు వరించినా.. ఇప్పుడు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది అక్కడ ఆమె పరిస్థితి. అలాగే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో, చేసేది లేక మళ్లీ ఇప్పుడు సినిమాలలో బిజీ కావాలని చూస్తుంది. 


అందులో భాగంగానే ఇప్పుడీ భామ టాలీవుడ్‌పై కన్నేసిందని అంటున్నారు. టాలీవుడ్‌లో మంచి ఆఫర్స్ ఉంటే చేయడానికి రెడీ అని ఇప్పటికే ఆమె సిగ్నల్స్ పంపినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతే కాదు త్వరలో నాగార్జున చేయబోయే ఓ రీమేక్ చిత్రంలో ఆమెనే హీరోయిన్ అంటున్నారు. నిజంగా ఆమె మళ్లీ టాలీవుడ్‌కి తిరిగివస్తే.. కొందరు స్టార్ హీరోలకు హీరోయిన్ కొరత తీరినట్లే. టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు ఉన్న హీరోయిన్ల కొరత తెలియంది కాదు. ముఖ్యంగా చిరు, బాలయ్య, వెంకీ, నాగ్‌లకు హీరోయిన్లు అస్సలు సెట్ అవ్వడం లేదు. వీరి పక్కన నటించడానికి హీరోయిన్లకు భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే వార్తలు కూడా ఈ మధ్య విన్నాం. అన్నట్లు రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఇలియానా చూసీచూడనట్లుగా వెళ్లాలనే నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  

Updated Date - 2020-07-12T03:09:59+05:30 IST