సృష్టికి ఆడపిల్ల ముఖ్యం

ABN , First Publish Date - 2020-02-18T04:56:50+05:30 IST

ఆడపిల్ల పుడితే.. అమ్మో అనుకుంటూ అమ్మేస్తున్న సమాజమిది. అలా అమ్మకానికి గురై అభాగ్యురాలైన ఓ యువతి ఎలా బతికింది? జీవితంలో ఏం సాధించింది అన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం ‘స్వేచ్ఛ’. గాయని మంగ్లీ టైటిల్‌ పాత్ర పోషించారు...

సృష్టికి ఆడపిల్ల ముఖ్యం

ఆడపిల్ల పుడితే.. అమ్మో అనుకుంటూ అమ్మేస్తున్న సమాజమిది. అలా అమ్మకానికి గురై అభాగ్యురాలైన ఓ యువతి ఎలా బతికింది? జీవితంలో ఏం సాధించింది అన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం ‘స్వేచ్ఛ’. గాయని మంగ్లీ టైటిల్‌ పాత్ర పోషించారు. కె.పి.ఎన్‌.చౌహన్‌ దర్శకుడు. ఆంగోత్‌ రాజు నాయక్‌ నిర్మాత. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకొస్తుందీ సినిమా నిర్మాత మాట్లాడుతూ ‘‘ఇందులో మంగ్లీ పోషించిన పాత్ర నేటితరం అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తుంది. వినోదం, భావోద్వేగం మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ‘‘పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంత ముఖ్యమో, ఈ సృష్టికి ఆడ పిల్ల అంతే ముఖ్యమని తెలిపే సినిమా ఇది. అద్భుతమైన నటన కనబర్చడమే కాకుండా ‘బంజారే బంజారే..’ పాటను మంగ్లీ అద్భుతంగా ఆలపించారు’’ అని దర్శకుడు చెప్పారు. ఓ మంచి పాత్రలో నటించడంతో పాటు సంగీతం అందించడం ఆనందంగా ఉందని భోలో షావలి తెలిపారు. 

Updated Date - 2020-02-18T04:56:50+05:30 IST