`జీఎఫ్` టీజర్ విడుదల!

ABN , First Publish Date - 2020-12-26T17:53:17+05:30 IST

స్వీయ దర్శకత్వంలో యువ హీరో చిరంజీవి కుంచాల నటిస్తున్న నూతన చిత్రం `జీఎఫ్`.

`జీఎఫ్` టీజర్ విడుదల!

స్వీయ దర్శకత్వంలో యువ హీరో చిరంజీవి కుంచాల నటిస్తున్న నూతన చిత్రం `జీఎఫ్`. వైదేహి శర్మ, అస్మా మిర్జా కథానాయికలుగా నటిస్తున్నారు. భారతి క్రియేషన్స్, కేథరీన్ ఫిల్మ్ మేకర్స్, మౌనిక ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది.


ఈ సందర్భంగా చిరంజీవి కుంచాల మాట్లాడుతూ... `చిరంజీవిగారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన స్ఫూర్తితోనే హీరోగా మారాను. `జీఎఫ్` సినిమాలో యాక్షన్, రొమాన్స్, ఎంటర్‌టైన్మెంట్ లాంటి అన్ని అంశాలు ఉంటాయి. ప్రస్తుతం మా సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. చిన్న చిత్రాలకు ఇండస్ట్రీ పెద్దలు మద్దతు నివ్వాలని కోరుతున్నాన`ని అన్నారు. 

Updated Date - 2020-12-26T17:53:17+05:30 IST