పెళ్లయ్యాక మంచి చిత్రాల్లో నటిస్తున్నారు!

ABN , First Publish Date - 2020-02-16T04:58:47+05:30 IST

‘‘ఆమని మంచి నటి. రాజశేఖర్‌గారితో ‘అమ్మకొడుకు’లో నటించినప్పట్నుంచి నాకు పరిచయం. మంచి కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. పెళ్లి తర్వాత కూడా మంచి చిత్రాల్లో...

పెళ్లయ్యాక మంచి చిత్రాల్లో నటిస్తున్నారు!

‘‘ఆమని మంచి నటి. రాజశేఖర్‌గారితో ‘అమ్మకొడుకు’లో నటించినప్పట్నుంచి నాకు పరిచయం. మంచి కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. పెళ్లి తర్వాత కూడా మంచి చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా ఉన్నారు. ఈమధ్య మహిళా ప్రాధాన్య చిత్రాలు తగ్గాయి. సమంత, తాప్సీతో కొత్త దర్శకులు తీశారు. స్త్రీ శక్తిని ఎవరూ ఆపలేరు. ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి’’ అని జీవితా రాజశేఖర్‌ అన్నారు. ఆమని ప్రధాన పాత్రలో ఎత్తరి మారయ్య, చిన మారయ్య, గురవయ్య నిర్మించిన చిత్రం ‘అమ్మ దీవెన’. శివ ఏటూరి దర్శకుడు. జీవితా రాజశేఖర్‌ ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. ‘‘మగదిక్కు లేని కుటుంబంలోని ఐదుగురు పిల్లల్ని ఒక మహిళ ఎలా చదివించింది? మంచి భవిష్యత్తు ఎలా ఇచ్చింది? అనేది చిత్రకథ’’ అని ఆమని అన్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామని దర్శక-నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి వెంకట్‌ అజ్మీర సంగీత దర్శకుడు.

Updated Date - 2020-02-16T04:58:47+05:30 IST