`బిగ్‌బాస్`పై గీతామాధురి సెటైర్!

ABN , First Publish Date - 2020-10-08T15:38:19+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయిన `బిగ్‌బాస్` కాన్సెప్టు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.

`బిగ్‌బాస్`పై గీతామాధురి సెటైర్!

ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయిన `బిగ్‌బాస్` కాన్సెప్టు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ కార్యక్రమం నాలుగో సీజన్ నడుస్తోంది. ఈ షోకు వివాదాలు కొత్త కాదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్లు కూడా విమర్శలు చేస్తుంటారు. మూడో సీజన్‌లో పాల్గొన్న వితికా షెరు ఇటీవల తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. బిగ్‌బాస్ వల్ల తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యానని చెప్పింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ఫిమేల్ కంటెస్టెంట్లు కూడా తమ అనుభవాలను వెల్లడించాలని కోరింది.   


ప్రముఖ గాయని, బిగ్‌బాస్ రెండో సీజన్‌లో పాల్గొన్న గీతామాధురి తాజాగా తన `బిగ్‌బాస్` అనుభవాన్ని షేర్ చేసింది. ఆ సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా బరిలోకి దిగిన గీత రన్నరప్‌గా నిలిచింది. ఆ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తీసుకున్న ఫొటోను గీత తాజాగా పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో గీత చాలా సన్నగా ఉంది. `రెండు సంవత్సరాల క్రితం ఫొటో. బరువు తగ్గించుకుని సన్నగా అవ్వాలనుకుంటే బిగ్‌బాస్‌కు వెళ్లమని మీకు సలహా ఇస్తాన`ని గీత కామెంట్ చేసింది. ఈ కామెంట్ చర్చనీయాంశంగా మారింది.


Updated Date - 2020-10-08T15:38:19+05:30 IST