కోర్టులో కేసు.. ఆలియాకు షాక్‌

ABN , First Publish Date - 2020-12-27T18:29:31+05:30 IST

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కి షాక్ తగిలింది. ఆమెపై కోర్టులో కేసు వేశారు ఒకరు. ఆ వ్యక్తి ఎవరు? అనే వివరాల్లోకి వెళితే.. ఆలియా భట్‌ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'గంగూబాయ్‌ కతియావాడి'.

కోర్టులో కేసు.. ఆలియాకు షాక్‌

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కి షాక్ తగిలింది. ఆమెపై కోర్టులో కేసు వేశారు ఒకరు. ఆ వ్యక్తి ఎవరు? అనే వివరాల్లోకి వెళితే.. ఆలియా భట్‌ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'గంగూబాయ్‌ కతియావాడి'. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శక నిర్మాతగా, జయంతిలాల్‌ గడాతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముంబై కామతిపూరను శాసించిన లేడీ డాన్‌గా పేరున్న గంగూబాయ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఆపాలంటూ గంగూబాయ్‌ కుమారుడు బాబూజీ రాజీ షా కోర్టులో కేసు వేశాడు. దర్శక నిర్మాతలతో పాటు, ఆలియా భట్‌లపై కేసు నమోదైంది. వీరితో పాటు మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై అనే నవలను రాసిన రచయిత హుస్సేన్‌ జైదీ పేరు కూడా ఇందులో చేర్చాడు బాబూజీ రాజీ షా. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా ఉందని కాబట్టి మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై పుస్తక ప్రచురణతో పాటు గంగూబాయ్‌ కతియావాడి సినిమాను ఆపాలంటే కేసును వేశారు బాబూజీ రాజీ షా. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Updated Date - 2020-12-27T18:29:31+05:30 IST