సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్న గంగవ్వ ఆర్మీ

ABN , First Publish Date - 2020-09-08T01:57:27+05:30 IST

బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌ ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈసారి కంటెస్టెంట్స్‌ అందరిలోకి ప్రత్యేకమైన

సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్న గంగవ్వ ఆర్మీ

బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌ ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈసారి కంటెస్టెంట్స్‌ అందరిలోకి ప్రత్యేకమైన వారు ఎవరైనా ఉన్నారంటే.. ఆ కంటెస్టెంట్‌ ఖచ్చితంగా మై విలేజ్ షో ద్వారా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రైన గంగవ్వే. అందుకే ఆమెని కింగ్‌ నాగ్‌ లాస్ట్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి పంపించారు. అయితే షోలోకి గంగవ్వ అడుగు పెట్టకముందే సోషల్‌ మీడియాలో ఆమె పేరు మీద రచ్చ రచ్చ జరుగుతుండటం విశేషం. 'గంగవ్వ ఆర్మీ' అంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న రచ్చ చూస్తే.. ఈసారి ఖచ్చితంగా గెలిచేది గంగవ్వే అన్నట్లుగా ఉంది యవ్వారం.


కౌశల్‌ టైమ్‌లో 'ఆర్మీ' అంటూ జరిగిన హడావుడి తెలియంది కాదు. అప్పటి నుంచి బిగ్‌బాస్‌ అనగానే ఈ 'ఆర్మీ'ల హవా సోషల్‌ మీడియాని వేడెక్కిస్తుంటుంది. అలాగే ఇప్పుడు కూడా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన ప్రతి కంటెస్టెంట్‌కు ముందే సోషల్‌ మీడియా అకౌంట్‌లు, ఆర్మీ అకౌంట్‌లు క్రియేట్‌ అయ్యాయి. అందరి సంగతి ఓకే కానీ, గంగవ్వకు కూడా ట్విట్టర్‌ అకౌంట్‌, గంగవ్వ ఆర్మీ అకౌంట్‌ క్రియేట్‌ అవ్వడం.. అప్పుడే సోషల్‌ మీడియాలో బిగ్‌బాస్‌ ట్వీట్స్ తో హోరెత్తిస్తుండటం విశేషం. ఇక నేష‌న‌ల్ మీడియా దృష్టిని ఆకర్షించిన గంగవ్వ.. ఇప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలా ఆకట్టుకుంటుందో తెలియదు కానీ.. ప్రస్తుతం అందరి దృష్టిని ఆమె ఆకర్షిస్తుందనడంలో మాత్రం అతిశయోక్తి లేదు.

Updated Date - 2020-09-08T01:57:27+05:30 IST