కుటుంబంతో సరదాగా...

ABN , First Publish Date - 2020-09-28T05:53:00+05:30 IST

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఊపిరితిత్తుల కేన్సర్‌ బారిన పడి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు షూటింగ్‌కు విరామం ఇచ్చి ప్రస్తుతం దుబాయ్‌లో...

కుటుంబంతో సరదాగా...

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఊపిరితిత్తుల కేన్సర్‌ బారిన పడి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు షూటింగ్‌కు విరామం ఇచ్చి ప్రస్తుతం దుబాయ్‌లో భార్యా పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. సంజయ్‌ భార్య మాన్యత ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘ఈ రోజు కుటుంబ సభ్యులందరం కలిశాము. ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు. ఎప్పటికీ ఇలాగే కలసి ఉండాలి’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. సంజయ్‌దత్‌ చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారనే వార్తలపై స్పందిస్తూ ‘‘ప్రస్తుతం చికిత్స కోసం ఎక్కడికీ వెళ్లాలనుకోవడం లేదు. ముంబయిలోని కోకిలాబెన్‌ హాస్పిటల్‌లో నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. అవసరమైతే అప్పుడు ఆలోచిస్తాం’’ అని చెప్పారు. సంజయ్‌దత్‌ ప్రస్తుతం ‘భుజ్‌’, ‘పృథ్వీరాజ్‌’, ‘కేజీఎఫ్‌-2’ చిత్రాల్లో నటిస్తున్నారు. 

Updated Date - 2020-09-28T05:53:00+05:30 IST