నవంబర్‌ నుంచి... బాక్సింగ్‌ రింగ్‌లోకి!

ABN , First Publish Date - 2020-09-24T07:02:08+05:30 IST

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు వెంకటేశ్‌ (బాబీ), సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు...

నవంబర్‌ నుంచి... బాక్సింగ్‌ రింగ్‌లోకి!

వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు వెంకటేశ్‌ (బాబీ), సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. నవంబర్‌ తొలి వారం నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ పునఃప్రారంభం కానుంది. కరోనాకి ముందు విశాఖపట్టణంలో 15 రోజుల పాటు వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ సాయీ మంజ్రేకర్‌, నవీన్‌ చంద్రపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఇప్పుడు నవంబర్‌ నుంచి మార్చి వరకూ ఐదు నెలల పాటు హైదరాబాద్‌లో షెడూల్స్‌ ప్లాన్‌ చేశారు. తర్వాత ఓ పాట చిత్రీకరణకు విశాఖ, మరికొంత భాగం చిత్రీకరణకు ఈశాన్య రాష్ట్రాలు, ఢిల్లీ వెళతారట. జగపతిబాబు, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, నదియా తదితరులు చిత్రీకరణలో పాల్గొననున్నారు. క్రీడా నేపథ్యంలో వాణిజ్య హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని స్వరాలు ఇచ్చారనీ, మరో రెండు పాటలు ఇవ్వవలసి ఉందని సమాచారం.


‘చిత్రజ్యోతి’లో మరిన్ని ఆసక్తికర 

కథనాల కోసం ఈ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. లేదా ఈ క్రింది యూఆర్‌ఎల్‌   

https://qrgo.page.link/7irX9లో చదవండి.

Updated Date - 2020-09-24T07:02:08+05:30 IST