అబద్ధాలను అమ్ముకోకండి.. గుంజన్ సక్సేనా చిత్ర బృందంపై మాజీ పైలట్ ఫైర్

ABN , First Publish Date - 2020-08-17T01:05:58+05:30 IST

గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ చిత్రంపై గుంజన్ సక్సేనాతో కలిసి పైలట్ శిక్షణ పొందిన మాజీ వింగ్ కమాండర్ నమ్రిత చాంది తీవ్ర ఆగ్రహం...

అబద్ధాలను అమ్ముకోకండి.. గుంజన్ సక్సేనా చిత్ర బృందంపై మాజీ పైలట్ ఫైర్

ముంబై: గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ చిత్రంపై గుంజన్ సక్సేనాతో కలిసి పైలట్ శిక్షణ పొందిన మాజీ వింగ్ కమాండర్ నమ్రిత చాంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలను అమ్మకుని డబ్బులు సంపాదించుకోవడం మానాలని హితవు పలికారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. చిత్రంలో ఐఏఎఫ్‌ను దారుణంగా కించపరిచారని, దేశ వాయుసేన అలా ఎప్పుడూ తమతో ప్రవర్తించలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘ఈ చిత్రంలో చూపించినట్లు వాయుసేన ఏనాడూ లేదు. నేను ఉద్యోగం చేసిన కాలంలో అలాంటి పరిస్థితులను ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఎంతో గొప్పదైన బ్లూ యూనిఫాంను ధర్మ ప్రొడక్షన్ తన చిత్రం ద్వారా దిగజార్చి చూపింద’ని చాందీ పేర్కొన్నారు. అంతేకాకుండా సినిమాకు అనుగుణంగా కొన్ని కల్పితాలను జోడించుకుంటే తప్పులేదని, అయితే అబద్ధాలను అమ్ముకోవడం దుర్భరమైన చర్య అని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2020-08-17T01:05:58+05:30 IST