మా హృదయాల్లో నిలిచే ఉంటావు.. సుశాంత్‌పై రైనా భావోద్వేగ పోస్ట్

ABN , First Publish Date - 2020-08-25T22:09:41+05:30 IST

సుశాంత్ సింగ్ మృతి తననెంతో బాధిస్తోందని, క్రికెటర్ సురేశ్ రైనా ఆవేదన వ్యక్తం చేశాడు. సుశాంత్‌ను ఎప్పటికీ మరచిపోలేనంటూ...

మా హృదయాల్లో నిలిచే ఉంటావు.. సుశాంత్‌పై రైనా భావోద్వేగ పోస్ట్

న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ మృతి తననెంతో బాధిస్తోందని, క్రికెటర్ సురేశ్ రైనా ఆవేదన వ్యక్తం చేశాడు. సుశాంత్‌ను ఎప్పటికీ మరచిపోలేనంటూ భావోద్వేగంగా ఓ పోస్ట్ చేశాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో సుశాంత్ చిత్రాన్ని రైనా చూపించాడు. అంతేకాకుండా బ్యాగ్రౌండ్‌లో సుశాంత్ నటించిన కేదార్‌నాథ్ చిత్రంలోని జాన్ నిసార్ పాట వినిపిస్తుండడం గమనించవచ్చు. ఈ వీడియోను షేర్ చేసిన రైనా..‘సోదరా.. మా హృదయాల్లో నీవు కలకాలం జీవించి ఉంటావు.


నీ విషయంలో పూర్తి న్యాయం చేకూరుతుందని నమ్ముతున్నాను. మన ప్రభుత్వం, నాయకులపై నాకు ఆ నమ్మకం ఉందం’టూ రైనా రాసుకొచ్చాడు. ఈ వీడియోను జస్టిస్ ఫర్ ఎస్‌ఎస్‌ఆర్ హ్యాష్‌ట్యాగ్‌తో రైనా పోస్ట్ చేశాడు.Updated Date - 2020-08-25T22:09:41+05:30 IST