పోస్ట్ ప్రొడక్షన్‌లో ‘ఫోర్ ప్లే’.. ఓటీటీ లేక ఏటీటీలో రిలీజ్

ABN , First Publish Date - 2020-07-28T21:22:33+05:30 IST

ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై బేబీ తనిష్క, జ్యోషిక సమర్పణలో చిక్కవరపు రాంబాబు నిర్మాతగా దర్శకుడు పి ప్రసాద్‌ను తొలిసారిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘ఫోర్ ప్లే’. ఎంతో

పోస్ట్ ప్రొడక్షన్‌లో ‘ఫోర్ ప్లే’.. ఓటీటీ లేక ఏటీటీలో రిలీజ్

ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై బేబీ తనిష్క, జ్యోషిక సమర్పణలో చిక్కవరపు రాంబాబు నిర్మాతగా దర్శకుడు పి ప్రసాద్‌ను తొలిసారిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘ఫోర్ ప్లే’. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువత చిన్న చిన్న సంతోషాల కోసం ఎలా పెడదోవ పడుతున్నారో... ఇంటికి దీపం ఇల్లాలుగా ఉండాల్సిన మహిళలు అమాయకంగా తీసుకునే నిర్ణయాల వల్ల ఎలా బ్లాక్ మెయిలింగ్‌కు గురి కాబడుతున్నారో వంటివాటి గురించి ఈ చిత్రంలో తెలియజేయడం జరుగుతుంది. అలాగే డబ్బు, ఇతరత్రా విషయాలు జీవితంలో  తుచ్ఛమైనవిగా భావించి.. ప్రేమించడం, ప్రేమించబడ్డ వ్యక్తితో నమ్మకంగా ఉండడం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పడమే మా చిత్రం యొక్క ఉద్దేశం అని దర్శకనిర్మాతలు తెలుపుతున్నారు.  


ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘నూతన నటీనటులతో షూటింగ్ చేశాము. హీరోయిన్ హరిణి మాత్రం ‘పిచ్చెక్కిస్తా’ చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. హీరో శ్యామ్, హీరోకి ఫ్రెండ్స్‌గా శ్రీకాంత్, నితిన్ వంటి వారంతా కొత్తవారే. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన మరొక హీరోయిన్ హారిక. ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా కొత్తగా రొమాంటిక్‌గా ఉంటుంది. ఈ చిత్రం లాక్‌డౌన్ కారణాలవల్ల హైదరాబాద్‌లోని పరిసర ప్రాంతాలలో చిత్రీకరించాము. కరోనా వైరస్ కారణంగా థియేటర్స్ లేక ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అందుకే సినిమాలను ఓటీటీ, ఏటీటీలను నమ్ముకుని అన్ని భాషలలో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి మా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము..’’ అని తెలిపారు. 

Updated Date - 2020-07-28T21:22:33+05:30 IST