నా పిల్లలకు కాబోయే తల్లికి..

ABN , First Publish Date - 2020-05-12T05:22:16+05:30 IST

నయనతారపై తన ప్రేమను వ్యక్తం చేసే విషయంలో విఘ్నేశ్‌ శివన్‌ ఎప్పుడూ వెనుకంజ వేయరు. అటువంటి వ్యక్తికి చక్కటి సందర్భం రావడంతో చెలరేగిపోయారు..

నా పిల్లలకు కాబోయే తల్లికి..

నయనతారపై తన ప్రేమను వ్యక్తం చేసే విషయంలో విఘ్నేశ్‌ శివన్‌ ఎప్పుడూ వెనుకంజ వేయరు. అటువంటి వ్యక్తికి చక్కటి సందర్భం రావడంతో చెలరేగిపోయారు. తనలో కవిని బయటకు తీశారు. మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి ‘‘భవిష్యత్తులో నా పిల్లలకు కాబోయే తల్లికి, ఆ తల్లి చేతుల్లో ఉన్న పిల్లాడి తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో విఘ్నేశ్‌ శివన్‌ పేర్కొన్నారు. విదేశాలకు విహార యాత్రకు వెళ్లినప్పుడు ఓ చిన్నారిని ఎత్తుకుని నయనతార దిగిన ఫొటోని ఆయన పోస్ట్‌ చేశారు. అలాగే, తల్లితో నయనతార ఫొటోలను పోస్ట్‌ చేసి ‘‘మిసెస్‌ కురియన్‌... అందమైన అమ్మాయికి జన్మనిచ్చి మంచి పని చేశారు’’ అని విఘ్నేశ్‌ పేర్కొన్నారు.


Updated Date - 2020-05-12T05:22:16+05:30 IST