నాన్నతో మొదటిసారి..

ABN , First Publish Date - 2020-10-05T08:00:12+05:30 IST

తమిళ నటుడు విక్రమ్‌ తన తనయుడు ధ్రువ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. హీరోగా విక్రమ్‌కి 60వ సినిమా కాగా, ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌ ‘ఆదిత్య వర్మ’తో హీరోగా...

నాన్నతో మొదటిసారి..

తమిళ నటుడు విక్రమ్‌ తన తనయుడు ధ్రువ్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. హీరోగా విక్రమ్‌కి  60వ సినిమా కాగా, ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌ ‘ఆదిత్య వర్మ’తో హీరోగా పరిచయమైన ధ్రువ్‌ విక్రమ్‌కు రెండో సినిమా. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కార్తీక్‌ సుబ్బరాజు దర్శకుడు. వచ్చే ఏడాది కొడైకనాల్‌లో ఈ సినిమా షూటింగ్‌  ప్రారంభమవుతుందని రఽధువ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. ‘‘రెండో సినిమాకే నాన్నతో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఇది ల్యాండ్‌మార్క్‌ సినిమా అవుతుంది. షూటింగ్‌ కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా’’ అని ధ్రువ్‌ తెలిపారు. 

Updated Date - 2020-10-05T08:00:12+05:30 IST

Read more