ఎఫ్‌ఎం లవ్‌స్టోరీ!

ABN , First Publish Date - 2020-10-08T11:02:57+05:30 IST

విజయ్‌ ేసతుపతి, జయరామ్‌ కీలక పాత్రధారులుగా నటించిన మలయాళ చిత్రం ‘మార్కొని మతాయ్‌’ తెలుగులో ‘రేడియో మాధవ్‌’గా అనువాదమవుతోంది...

ఎఫ్‌ఎం లవ్‌స్టోరీ!

విజయ్‌ ేసతుపతి, జయరామ్‌ కీలక పాత్రధారులుగా నటించిన మలయాళ చిత్రం ‘మార్కొని మతాయ్‌’ తెలుగులో ‘రేడియో మాధవ్‌’గా అనువాదమవుతోంది. పూర్ణ, ఆత్మీయ రాజన్‌ నాయికలు. సనల్‌ కలతిల్‌ దర్శకుడు. లక్ష్మీ చెన్నకేశవ ఫిలిమ్స్‌ పతాకంపై కృష్ణస్వామి తెలుగులో విడుదల చేస్తున్నారు. బుధవారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కేరళ పచ్చటి అందాల మధ్య ఉన్న చంగనస్సేరి పట్టణంలో ఎఫ్‌.ఎం. రేడియో స్టేషన్‌ నేపథ్యంలో సాగే ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ ఇది. అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. థియేటర్లు తెరవడాన్ని బట్టి విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చెప్పారు. 

Updated Date - 2020-10-08T11:02:57+05:30 IST